ఉపాధి హామీ పనిపై కేంద్రం కుట్ర

నవతెలంగాణ-బూర్గంపాడు
ఉపాధి హామీ పని కనుమరుగు అయ్యే పరిస్థితిని కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకొస్తుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్య క్షులు బత్తుల వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని సారపాకతాళ్లగుమ్మూరు పంచాయతీ పరిధిలో కొల్లులో పనిచేస్తున్న కార్మికులను ఆ ప్రాంతాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. ఈసందర్భంగా కార్మికులను వారి సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. రోజుకి 120 నుండి 150 మాత్రమే పడుతున్నాయని చాలా దారుణంగా కొలతలు పేరుతో దగా చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం కనీసం వేతనం రూ.600 ఇవ్వాలని, 200 రోజులు పని చూపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రెడ్డి, తిరపతయ్య, సంధ్య, తిరుపతమ్మ, రాఘవులు, ఉమామహేశ్వర రావు, లక్ష్మి, రామాంజనేయ రెడ్డి, సుశీల, ధన లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Spread the love