గీతాప్రెస్‌కు గాంధీ శాంతి పురస్కారం ఎంపిక చేసిన కేంద్రం

న్యూఢిల్లీ : మహాత్మా గాంధీ పేరిట ఏటా అందజేసే గాంధీ శాంతి పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2021 ఏడాదికి గాను గోరఖ్‌పూర్‌లోని ప్రఖ్యాత గీతాప్రెస్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. అహింస, గాంధేయ పద్ధతుల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన కోసం అందించిన విశేష కృషికి గుర్తింపుగా గీతాప్రెస్‌ ప్రచురణ సంస్థను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో వివరించింది. ప్రధాని మోడీ సారథ్యంలోని జ్యూరీ పురస్కారానికి గీతా ప్రెస్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్టు పేర్కొన్నది. గీతాప్రెస్‌ స్థాపించి వందేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ పురస్కారానికి ఎంపిక కావడం సామాజిక సేవలో ఆ సంస్థ కృషికి దక్కిన గొప్ప గుర్తింపు అని వివరించింది. 1923లో ఆరంభమైన గీతాప్రెస్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రచురణ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. 14 భాషల్లో 41.7 కోట్లకు పైగా పుస్తకాలను ప్రచురించి రికార్డు నెలకొల్పింది.

Spread the love