ఇఎస్‌జి గ్లోబల్‌ కాన్ఫరెన్స్‌లో సెంట్రల్‌ బ్యాంక్‌

న్ఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (సిబిఐ) ఎండి, సిఇఒ ఎంవి రావు ఇఎస్‌జి గ్లోబల్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. న్యూ ఢిల్లీలో జరిగిన ఇఎస్‌జి (ఎన్వరైన్‌ మెంట్‌, సోషల్‌, గవర్నెన్స్‌) కార్య క్రమంలో వివిధ రంగాలకు చెంది న 200 కంపెనీలు, సంస్థలు, ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేగ్వాల్‌, ఎంవి రావు, సినీనటుడు వివేక్‌ ఒబేరారు హాజరయ్యారు. ఇందులోని గ్లోబల్‌ పృథ్వి అవార్డ్స్‌ జ్యూరీ సభ్యుల్లో ఎంవి రావు కీలకంగా వ్యవహారించారు. బ్యాంక్‌ ఉద్యోగులో ఇఎస్‌బి సస్టెయిని బిలిటీ పెంచడానికి రామానుజన్‌ కాలేజీ, ఢిల్లీ యూనివర్శిటీలతో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు పేర్కొంది.

Spread the love