తెలంగాణ, ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త

నవతెలంగాణ – హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రెండు రాష్ట్రాలకు కొత్త మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. తెలంగాణలో నాలుగు మెడికల్ కాలేజీలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. ఏపీకి మరో రెండు మెడికల్ కళాశాలలు ప్రకటించడం జరిగింది. తెలంగాణలో మరో 4 మెడికల్‌ కాలేజీలకు అనుమతి ఇవ్వగా ఈ మేరకు తెలంగాణకు మెడికల్‌ కాలేజీలు మంజూరు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. యాదాద్రి, మెదక్‌, మహేశ్వరం, కుత్బుల్లాపూర్‌లో మెడికల్‌ కాలేజీలకు అనుమతి ఇచ్చింది కేంద్రం. ఈ ఏడాది తెలంగాణకు మొత్తం 8 మెడికల్‌ కాలేజీలు కేటాయింపులు చేసింది.ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభానికి కూడా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అటు ఏపీలో ప్రకటించిన రెండు మెడికల్ కాలేజీలు కడప అలాగే పాడేరులో ఏర్పాటు చేయనున్నారు. గత సంవత్సరమే ఏపీకి 5 మెడికల్ కాలేజ్ ఇచ్చిన కేంద్రం… ఈసారి మరో రెండు ఇవ్వడం జరిగింది.

Spread the love