కేంద్ర పథకాలు అర్హులకు అందించాలి

– కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అజరు గుప్తా
నవ తెలంగాణ సిద్దిపేట కలెక్టరేట్‌
కేంద్ర పథకాలు అర్హులకు అందించాలని కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అజరు గుప్తా అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన పెంపొందించడం, పథకాలు అర్హులకు అందేలా తెలియజేయడానికి రూపొందించిన కార్యక్రమమే వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర అని తెలిపారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో సిద్దిపేట జిల్లాలో చేపట్టనున్న విక్‌సిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్రపై సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో కేంద్ర టెక్స్టైల్‌ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సమీక్షించారు. అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును అభినందించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ లోకల్‌ బాడీస్‌ గరిమ అగ్రవాల్‌, అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) శ్రీనివాస్‌ రెడ్డి, డిఆర్డిఓ జయదేవ్‌ ఆర్య, ఎల్డిఎం సత్యజిత్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Spread the love