శేఖర్ కమ్ముల ఇంటి దగ్గర చైన్ స్నాచింగ్ ఘటన

chain-snatchingనవతెలంగాణ – హైదరాబాద్
సికింద్రాబాద్ లో పట్టపగలే దారుణం జరిగింది. వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసును దొంగ లాక్కెళ్లాడు. పద్మారావునగర్ లో ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇంటి పక్కనే ఈ ఘటన చోటుచేసుకుంది. సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం.. వృద్ధురాలితో మాట్లాడుతున్న ఓ యువకుడు ఉన్నట్టుండి ఆమె మెడలో బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. గొలుసును బలంగా లాగడంతో వృద్ధురాలు కిందపడిపోయింది. బంగారు గొలుసు చేజిక్కించుకున్న యువకుడు అక్కడి నుంచి పారిపోవడం వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనపై బాధితురాలు చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. దొంగను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. చైన్ స్నాచర్ ను గుర్తించి వీలైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Spread the love