మోర్తాడ్ లో చైన్స్ స్నాకింగ్

నవతెలంగాణ – మోర్తాడ్
మండలం వడ్డీ ఆర్ట్ గ్రామంలోని ఎంపీ యుపిఎస్ స్కూల్ నందు విధులు పని ఇంటికి వస్తున్న తొగేటి శ్రావణి మెడలో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు చైన్ దొంగలించినట్లు ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వడ్డీ యార్డ్ గ్రామంలో టీచరుగా విధులు నిర్వహిస్తున్న శ్రావణి సాయంత్రం నాలుగు గంటలకు ఇంటికి వస్తుండగా ద్విచక్ర వాహనంపై మాస్కులు ధరించి గుర్తుతెలియని వ్యక్తులు మెడలో ఉన్న తులం బంగారం లాక్కొని వెళ్లినట్లు తెలిపారు. ఏది మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Spread the love