తెలంగాణ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ హఠాన్మరణం

నవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ కన్నుమూశారు. గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇటీవల ఆయన కారుకొండలోని ఫౌమ్‌హౌస్‌‌లో ఉండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయనను నాగర్‌కర్నూల్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆయనను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయిచంద్ హఠాన్మరణం చెందారు.

Spread the love