గ్రంథాలయానికి పుస్తకాలు అందించడం అభినందనీయం: చైర్ పర్సన్ మంజుల

నవతెలంగాణ – సిద్దిపేట
ప్రభుత్వ పాఠశాల గ్రంధాలయానికి సొంత ఖర్చులతో కౌన్సిలర్‌ వరాల కవిత సురేష్ పుస్తకాలు అందించడం అభినందనీయమని మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం ప్రభుత్వ పాఠశాలలో విద్య దినోత్సవం సందర్భంగా 8వ వార్డ్ లోని ఇందిరా నగర్ మండల ప్రాథమిక పాఠశాలలో నూతన గ్రంధాలయాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ ప్రారంభించారు. ఈ నూతన గ్రంధాలయనికి 800 పాఠ్య పుస్తకాలను కౌన్సిలర్‌ వరాల కవిత సురేష్ రూ 21 వేలు వెచ్చించి తన స్వంత నిధులతో అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మావతి, కౌన్సిలర్‌ పూర్ణిమా యాదవ్‌, రాహుల్ రెడ్డి, ప్రవీణ్, లక్ష్మణ్, అజ్జూ శ్రవణ్, సాయి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love