ఘనంగా చల్లా వంశీచంద్‌రెడ్డి జన్మదిన వేడుకలు

కాంగ్రెస్‌ మండలాధ్యక్షులు డోకూరు ప్రభాకర్‌ రెడ్డి
నవతెలంగాణ-తలకొండపల్లి
మండల కేంద్రంలో ఎఐసీసీి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌ రెడ్డి జన్మదిన వేడుకలు అంబరాన్ని అంటాయని కాంగ్రెస్‌ మండలాధ్యక్షులు డోకూరు ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం తలకొండపల్లి మండల కేంద్రంలో బస్టాండ్‌ ఎదురుగా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఎఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం వృద్ధులకు అరటి పండ్లు, స్వీట్లు బస్సులో ప్రయాణించిన వారికి అరటి పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు. ఎఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌ రెడ్డికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుడు చల్లని దీవెనలు దీవించాలని కాంగ్రెస్‌ మండలాధ్యక్షులు డోకూర్‌ ప్రభాకర్‌రెడ్డి కోరుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర కిసాన్‌ సెల్‌ నాయకులు మోహన్‌ రెడ్డి, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు భగవాన్‌ రెడ్డి, రంగారెడ్డి జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షులు జగన్‌, డిసిసి ప్రధాన కార్యదర్శి అంజయ్య గుప్తా, డిసిసి కార్యదర్శి రవీందర్‌ యాదవ్‌, మాజీ ఎంపీటీసీ రాములు, అసెంబ్లీ సోషల్‌ మీడియా ఇన్‌చార్జి అజీమ్‌, డేవిడ్‌, డిగ్రీ కృష్ణ, యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు జనార్దన్‌ రెడ్డి, మైనారిటీ మండల అధ్యక్షులు ఆరిఫ్‌, కిసాన్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు విష్ణు, ఎన్‌ఎస్‌యు ఐ మండల అధ్యక్షులు రమేష్‌, మాజీ ఉపసర్పంచ్‌ చెన్నకేశవులు, సీనియర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తిరుపతి రెడ్డి, రామస్వామిగౌడ్‌, శేఖర్‌ రెడ్డి, యూత్‌ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అనీల్‌, యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు లింగం యాదవ్‌, రమేష్‌, భాస్కర్‌, గౌస్‌, మధుసూదన్‌, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Spread the love