తెలంగాణ ఉద్యమంలో చల్మరెడ్డి పాత్రకీలకం

Chalmareddy played a key role in the Telangana movementఇబ్రహీంపట్నం మార్కెట్‌ కమిటీ డైరక్టర్‌ మహమ్మద్‌ జానీపాషా
నవతెలంగాణ-మంచాల
మలిదశ తెలంగాణ ఉద్యమంలో వేదిరే చల్మారెడ్డి పాత్ర కీలకమని ఇబ్రహీంపట్నం మార్కెట్‌ కమిటీ డైరక్టర్‌ మహమ్మద్‌ జానీపాషా అన్నారు. సోమవారం వేదిరే చల్మా సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ వేదిరే చల్మారెడ్డి మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో జన్మించారని అన్నారు. రంగారెడ్డి జిల్లా జేఏసీ చైర్మెన్‌గా ఉండి ఎంతో మంది యువతకు అండగా ఉన్నారని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొ న్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిందము రఘుపతి, లాలగారి జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love