పాత పెన్షన్ సాధన కై ఆగష్టు 12 న చలో  హైదరాబాద్ పిలుపు..

– హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు నరేందర్ రావు
నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
 ఉద్యోగుల పొట్టలు కొట్టి  పెట్టుబడి దారుల పెట్టెలు నింపడానికి, పుట్టిన పెట్టుబడి దారి పెన్షన్ విధానం మరియు  కనీస హామీ లేని జీవనది లాంటి పెట్టుబడిపై కన్నేసిన, పెట్టుబడి దారి పెద్దల మస్తీష్కపు పుట్టలో  మొలకెత్తిన విషపు బీజం సీ పీ ఎస్,ఎన్ పి ఎస్ అంతం చేయడం కొరకు సాగుతున్న పోరాటం లో భాగంగా ఆగష్టు 12 న చలో హైదరాబాద్ పేరుతో రాష్ట్ర స్థాయి సభను నిర్వహించడం జరుగుతుంది.ఈ సభ ను విజయవంతం చేయాలని కోరుతూ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు నరేందర్ రావు ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లాలోని ప్రధాన కార్యాలయంలలో ప్రచారం నిర్వహించడం జరిగింది.గత దశాబ్ద కాలంగా విన్నపాలకే పరిమితమైన CPS రద్దు అంశాన్ని, ” పెన్షన్ బిక్ష కాదు ఉద్యగి హక్కు ” అని నినదించి  2016 లో పోరుబాట పట్టించి పోరాట బాపుటా ఎగరేసింది.”అభి నహీతో కబీ నహీ ” నినాదం తో  రాష్ట్రము లోని అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల మద్దతు, సహకారం తో, నిన్నటి వరకు సాగిన  “పాత పెన్షన్ సాధన సంకల్ప యాత్రలో ” 33 జిల్లాలో సమర శంఖం పూరించింది అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్  పేర్కొన్నారు. బుధవారంకమీషనర్, భూ పరిపాలనప్రధానకార్యాలయం, సంచాలకులు, వైద్య విధాన పరిషత్ కోఠి. హైదరాబాద్ జిల్లా ప్రధాన ఆసుపత్రి, సాంకేతిక ,కళాశాల విద్య ప్రధాన కార్యాలయం, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, ఎర్రమంజిల్ జల సౌద ప్రధాన కార్యాలయంలో ఇంజనీరింగ్ ఉద్యోగుల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామకృష్ణ అర్చన ఆధ్వర్యంలో  నిర్వహించడం జరిగింది.అభి నహి తో కబీ నహీ అనే నినాదంతో తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్స్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం స్థిత ప్రజ్ఞ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ సభను ఈ నెల 12న నిర్వహించేందుకు తామంతా కుటుంబ సభ్యులతో సహా హాజరవుతామని ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరు అవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ కోటకొండ పవన్. హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు అశోక్ రెడ్డి. శ్యాంసుందర్. ఈసీ మెంబర్స్ అరవింద్. అంజిరెడ్డి. రెడ్డప్ప. మల్లేష్ ప్రవీణ్ భాస్కర్ మల్లేష్. ప్రవీణ్ .తదితరులు పాల్గొన్నారు
Spread the love