– బిఎల్టియు రాష్ట్ర అధ్యక్షులు: దండి వెంకట్
నవతెలంగాణ-కంటేశ్వర్
బీడీ కార్మికులకు జీవన భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 15న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే మహా ధర్నాలో బీడీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ బి ఎల్ టి యు రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ పిలుపునిచ్చారు.గత రెండు ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం బీడీ కార్మికులకు జీవన భృతి ఇస్తామని హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తరువాత బీడీ కార్మికులకు ఇచ్చిన హామీ విస్మరించిందని దండి వెంకట్ ఆరోపించారు. ఈ మేరకు శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల బహుజన లెఫ్ట్ ఫ్రంట్-బిఎల్ఎఫ్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 15 జరిగే మహాధర్నాలో బిజెపి, బీఆర్ఎస్ రాజకీయ పార్టీలు మినహా అన్ని వామపక్ష, రాజకీయ పార్టీలు హాజరవుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయవంతం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో బహుజన మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బని లత, బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ బి ఎల్ టి యు జిల్లా అద్యక్షులు జిల్లా కె.మధు , బి ఎల్ టి యు నగర అధ్యక్షులు టి.రాజు పాల్గొన్నారు.