– 39 అంశాలపై డిక్లరేషన్‌ను ప్రకటించిన ఎన్‌పీఆర్‌డీ
– రాజకీయ పార్టీల ఎన్నికల ప్రణాళికలో తమ సమస్యలు చేర్చాలి :ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అడివయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వికలాంగుల సమస్యలను పరిష్కరించటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనీ, తక్షణ వారి సమస్య లు పరిష్కరించాలని కోరుతూ వచ్చే నెల 9న చలో హైదరబాద్ కార్య క్రమాన్ని నిర్వహించ నున్నట్టు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక( ఎన్‌పీఆర్‌డీ) రాష్ట్ర కార్యదర్శి ఎం అడివయ్య తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆ సంఘం రాష్ట్ర కారాలయంలో వికలాంగులు ఎదుర్కొం టున్న 39 అంశాలపై వికలాంగుల డిక్లరేషన్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో అడివయ్యతో పాటు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె. వెంకట్, కోశాధికారి ఆర్ వెంకటేష్, ఉపాధ్యక్షులు బోల్లేపల్లి స్వామి, సభ్యురాలు పి శశికళ ఉన్నారు. ఈ సందర్భంగా అడివయ్య మాట్లాడుతూ పెన్షన్ రూ.10 వేలకు పెంచాలనీ, వికలాంగుల కమిషన్ ఏర్పాటు చేసి, చైర్మెన్, సభ్యులను నియమించాలని డిమాండ్ చేశారు. శారీరక వికలాంగుల రోస్టర్ 10లోపు తగ్గించాలనీ, వారి సంక్షేమం, సాధికారత కోసం వికలాంగుల బంధు పథకం ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి జిల్లా కేంద్రంలో స్పెషల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. సాధారణ ఎన్నికల్లో ఆయా రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికలో వికలాంగుల సమస్యలను పొందుపర్చాలని కోరారు.
వికలాంగుల సమస్యలపై వచ్చే నెల 9న చలో హైదరాబాద్
2:09 am