సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన చామల..

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బుధవారం హైదరాబాదులో భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జ్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తో పాటు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి,  మాజీ శాసనసభ్యులు జనగాం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మూరు ప్రతాపరెడ్డి  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీ కలిసి సిఎం ను సన్మానించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికలలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి భారీ మెజారిటీ వచ్చే విధంగా కృషి చేసినందుకు ఎన్నికల ఇంచార్జ్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తో పాటు మిగతా ఎమ్మెల్యేలను, జనగాం జిల్లా అధ్యక్షుడిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.
Spread the love