మధ్యాహ్న భోజనంలో ఊసరవెల్లి.. 65మంది పిల్లలకు అస్వస్థత

నవతెలంగాణ – హైదరాబాద్: ఝార్ఖండ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో ఊసరవెల్లి కళేబరం రావడం కలకలం రేపింది. టోంగ్రా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పటికే ఆహారం తిన్న 65మంది పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులు వాంతులు చేసుకున్నారని, ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love