చాంపులాల్ జాతర వేలం పాటలు

నవతెలంగాణ – చివ్వేంల
మండల పరిధిలోని పులి తండాలో ఈనెల  25, 26 తారీకుల్లో జరగనున్న  శ్రీశ్రీశ్రీ చాంపులాల్ స్వామి జాతరలో  వివిధ రకాల దుకాణాల నిర్వహణకు హక్కుదారుల వేలం పాటలు  బుధవారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యాపేటకు చెందిన  నాగరాజు మిఠాయి విక్రయానికి రూ.64,500 దక్కించుకున్నారు. వరి పేలాలు అమ్ముకొనుటకు గాను నాగరాజు రూ.30 వేలకి దక్కించుకున్నారు.  తలనీలాల సేకరణకు గాను 26 వేలకు జంపాలమల్లయ్య దక్కించుకున్నారు.  కొబ్బరికాయలు అమ్ముకొనుటకు గాను రంగయ్య రూ. 23,500 దక్కించుకున్నట్టు పంచాయతీ కార్యదర్శి స్రవంతి తెలిపారు.  ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి రాజశేఖర్ రావు, ఎంపీ ఓ గోపి, పంచాయతీ కార్యదర్శులు చలమయ్య, ఆదినారాయణ పాల్గొన్నారు.
Spread the love