చాంపియన్‌ మడిసన్‌ కీస్‌

Champion Madison Keys– ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 2025
మెల్‌బోర్న్‌ : ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అమెరికా అండర్‌ డాగ్‌, 29 ఏండ్ల మడిసన్‌ కీస్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో రెండు సార్లు చాంపియన్‌ అరినా సబలెంకపై మడిసన్‌ కీస్‌ మూడు సెట్ల సమరంలో పైచేయి సాధించింది. 6-3, 2-6, 7-5తో మడిసన్‌ కీస్‌ గెలుపొందింది. మడిసన్‌ కీస్‌ కెరీర్‌లో ఇదే తొలి గ్రాండ్‌స్లామ్‌ విజయం. ఆరు ఏస్‌లు, నాలుగు బ్రేక్‌ పాయింట్లతో కీస్‌ అదరగొట్టింది. పాయింట్ల పరంగా 92-91తో సబలెంకకు గట్టి పోటీ ఇచ్చింది. మడిసన్‌ 15 గేములు నెగ్గగా, సబలెంక 14 గేములు గెలుపొందింది. నేడు జరిగే పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ జానిక్‌ సినర్‌తో రెండో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ తలపడనున్నాడు.

Spread the love