చాంప్స్‌ అంకోలియ, అరివ్‌

హైదరాబాద్‌ : జాతీయ ర్యాంకింగ్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నీలో యువ ప్యాడ్లర్లు అదరగొడుతున్నారు. మంగళవారం ముగిసిన అండర్‌-11 విభాగంలో అరివ్‌ దత్తా, శయన త్యాగి విజేతలుగా నిలిచారు. బార్సు ఫైనల్లో 11-9, 11-9, 11-4తో క్రిష్‌పై అరివ్‌ గెలుపొందగా..
గర్ల్స్‌ ఫైనల్లో 1-10, 7-11, 11-8, 11-8తో వెంకట మహిమ కృష్ణ (తెలంగాణ)పై త్యాగి పైచేయి సాధించింది. అండర్‌-13 యూత్‌ గర్ల్స్‌ విభాగం ఫైనల్లో అంకోలిక చక్రవర్తి పసిడి సాధించింది. ఫైనల్లో రజిని సింగ్‌పై 11-3, 11-4, 11-3తో బెంగాల్‌ అమ్మాయి గెలుపొందింది. విజేతలకు తెలంగాణ టేబుల్‌ టెన్నిస్‌ సంఘం ఆఫీస్‌ బేరర్లు పతకాలు ప్రదానం చేశారు.

Spread the love