– ఉత్తమ పర్యాటక గ్రామంగా చంద్లాపూర్ గ్రామాన్ని ఎంపిక చేసిన కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ..
– ప్రపంచ స్థాయిలో గుర్తింపు..
– చంద్లాపూర్ లో పరిడవిల్లిన పర్యాటకం.. ఉట్టిపడిన చేనేత కళావైభవం…
– ఢిల్లీలో అవార్డు అందుకున్న చంద్లాపూర్ గ్రామ సర్పంచ్..
– యావత్ ప్రజలకు శుభాకాంక్షలు తెల్పిన మంత్రి హరీష్ రావు
నవతెలంగాణ – చిన్నకోడూరు :
సిద్దిపేట అంటే అభివృద్ధిలో.. అవార్డుల్లో ఆదర్శమని.. మంత్రి హరీష్ రావు కృషితో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ దేశానికే ఆదర్శంగా.. రాష్ర్టానికి రోల్ మోడల్ గా నిలుస్తున్నది. ఇప్పటికే సిద్దిపేటకు 50 వరకు జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డ్ లను సొంతం చేసుకున్న సిద్దిపేట మరో గొప్ప ఖ్యాతిని దరిచేరింది.. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన సిద్దిపేట అన్ని రంగాల్లో కూడా అవార్డు లు సాధించిన ఘనత కూడా సిద్దిపేటకె దక్కింది. స్వచత, పచ్చదనం, విద్యా, వైద్యం, క్రీడా ఇలా అన్ని రంగాల్లో అవార్డులు సాధించి నేడు సిద్దిపేట పర్యాటక రంగం లో కూడా అవార్డు సాధించడం గొప్ప విశేషం. అది మంత్రి హరీష్ రావు గారి అభివృద్ధికి.. తపనకు నిదర్శనం..
ప్రపంచమంత వెల్లి విరిసిన సిద్దిపేట పర్యాటకం..
ఒకప్పుడు సిద్దిపేట అంటే పందులకు నిలయం..అపరిశుభ్రతకు నెలవు ..కరువు కటకటాలు అనే మాటలు విన్నాం. కానీ నేడు సిద్దిపేట నే గొప్ప పర్యాటకం అనే స్థాయి కి లో ఉంది.. మంత్రి హరీష్ రావు గారి కృషి కోమటి చెరువు గొప్ప పర్యాటకంగా తీర్చిదిద్దారు. అంతకు రెట్టింపు మన కళ్ళ ముందు రంగనాయక సాగర్ రూపంలో జలదృశ్యం అవిషకృతం అయింది. ఈ రంగనాయక సాగర్ సిద్దిపేట లోని చంద్లాపూర్ గ్రామంలో నిర్మాణము అయింది..
సిద్దిపేట జిల్లాలోని చంద్లాపూర్ గ్రామం దేశంలోనే అత్యుత్తమ గ్రామీణ పర్యాటక గ్రామంగా అరుదైన ఘనత సాధించింది. పర్యాటక మంత్రిత్వ శాఖ తెలంగాణ రాష్ట్రంలోని చిన్న గ్రామీణ ప్రాంతాన్ని ప్రాంత ప్రత్యేకత, వివిధ రంగాలలో సాధించిన విజయాలను పరిగణలోనికి తీసుకొని ఎంపిక చేసింది. 4500 జనాభా ఉన్న ఈ గ్రామం అరుదైన చేనేతకు ప్రసిద్ధి చెందింది. వైవిధ్యమైన గొల్లభామ చీరలతో సహా ప్రత్యేకమైన చేనేత రకాలను కలిగి ఉన్న ఈ గ్రామం పురాతన, సాంప్రదాయ చేనేత కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామం గ్రామీణ పర్యాటకానికి ప్రసిద్ధి చెందిన రంగనాయకస్వామి ఆలయ పరిధిలో ఉంది. గ్రామం నలువైపులా కోమటి చెరువు సరస్సు, వర్గల్ సరస్వతి దేవాలయం, చేరియాల నకాషి పెయింటింగ్ క్లస్టర్ తో ప్రత్యేకత సంతరించుకున్నది. ఈ గ్రామీణ ప్రాంతంలోనే పర్యాటక ఆకర్షణలలో ఒకటైన కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయం కూడా ఉండడం విశేషం. సాంస్కృతిక పరంగా ఈ గ్రామంలో దేవాలయాలు, మసీదులు, చర్చిల వంటి పురాతన మతపరమైన ఆకర్షణలకు ప్రసిద్ధిగాంచడం తో పాటు ఈ ప్రాంతంలో సాంస్కృతిక వనరులు, ఐకానిక్ హస్తకళలు సాంప్రదాయ వైభవం ప్రతిబింబిస్తాయి. రంగనాయక స్వామి దేవాలయం మానసిక, శారీరక రుగ్మతల నివారణగా ప్రతీక చెందింది. అదనంగా రంగనాయక సాగర్ రిజర్వాయర్ చంద్లాపూర్‌కు గ్రామానికి మరో మనిహరంగా మారింది, రిజర్వాయర్ ఈ ప్రాంతానికి అరుదైన విశిష్టతను తీసుకువచ్చింది అనడం లో సందేహం లేదు. సిద్దిపేట పట్టణానికి సమీపంలో ఉన్న కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ యొక్క లింక్ రిజర్వాయర్లలో రంగనాయక సాగర్ ఒకటి. రంగనాయక సాగర్‌ను మెగా టూరిజం డెస్టినేషన్‌గా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ భాగాన్ని రూ.100 కోట్లతో సమావేశాలు, ప్రోత్సాహకాలు, సమావేశాలు మరియు ప్రదర్శనలకు అనువుగా పర్యాటక గమ్యస్థానంగా అభివృద్ధి చేసింది. తరతరాలుగా ప్రసిద్ధి చెందిన గొల్లభామ చీరల ఉత్పత్తికి కేంద్రంగా ఉన్న ఈ గ్రామం ఇక్కడి సంస్కృతిని ప్రోత్త్సహించడంతో పాటు సాంస్కృతిక, పర్యాటక రంగం పరిరక్షణకు ప్రసిద్ధి గాంచింది. అంతే కాదు చంద్లాపూర్ పర్యావరణ సుస్థిరత కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందడంతో పాటు మైక్రో వాటర్ షెడ్ కార్యకలాపాలను ప్రోత్సహించడం, సహజ వనరుల సమాజ ఆధారిత నిర్వహణ కోసం గ్రామ వాసులు వివిధ కార్యక్రమాలు చేపట్టారు. అదే విధంగా చంద్లాపూర్ గ్రామం ప్లాస్టిక్ నిషేధానికి ప్రసిద్ధి చెందింది. ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కలిపిస్తూ ఈ గ్రామం నివాసితులకు గుడ్డ సంచులు, జనపనార సంచులను అందించారు. అంతే కాదు పర్యావరణ రక్షణలో భాగంగా సోలార్ లైట్ల వినియోగిస్తున్నారు. ఈ గ్రామం తెలంగాణకు హరిత హారంని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ గ్రామంలో విరివిగా మొక్కలు నాటి పచ్చని గ్రామంగా తీర్చి దిద్దారు. టూరిజం విస్తరణతో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని కల్పిస్తోంది. గ్రామంలో ప్రాథమిక సౌకర్యాలను మెరుగుపర్చుకుంటూ ఆర్ధికంగా నిలదొక్కుకుంటూ, సాంస్కృతిక పర్యాటక రంగాలలో అబివృద్ది సాధిస్తూ ప్రణాళిక బద్ధంగా చేపట్టిన కార్యక్రమాలతో గ్రామం సాధించిన ప్రగతీ నేడు గ్రామాన్ని జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపింది. హరిత హోటల్ , శిల్పారామం పర్యాటకులను ఆకర్షిస్తోంది. టూరిజం డెవలప్మెంట్, వాల్యూ చైన్ ఇంటిగ్రేషన్ తో ఈ గ్రామీణ ప్రాంతంలో వ్యాపార అభివృద్ధికి అనుకూలమైన ఫ్రేమ్‌వర్క్‌ను ప్రోత్సహించడానికి కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డ్రైవ్ కింద ఈ గ్రామంలో టూరిజం కార్యకలాపాలు పెద్ద విజయం. చంద్లాపూర్‌తో పాటు, జనగాం జిల్లాలోని పెంబర్తి గ్రామం ఉత్తమ పర్యాటక గ్రామలుగా ఎంపికైంది. 795 గ్రామీణ ప్రాంతాలలో, పెంబర్తికి గ్రామీణ కళాకారుల కార్యకలాపాలను పరిరక్షించడం, ప్రోత్సహించడంతో ఈ గుర్తింపు లభించింది.
డిల్లీ లో అవార్డు అందుకున్న చంద్లాపూర్ గ్రామ సర్పంచ్
జాతీయ స్థాయి లో బెస్ట్ టూరిజం విలేజ్ గా చంద్లాపూర్ గ్రామంగా ఎంపిక కాగా దేశ రాజధాని ఢిల్లీ లో నేడు బుధవారం చంద్లాపూర్ గ్రామ సర్పంచ్ సురగొని చంద్రకళరవి, జిల్లా ఆడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి లు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ అజయ్ భట్ చేతుల మీదుగా ఈ అవార్డు ను అందుకున్నారు..
భూమి త్యాగం చేసిన త్యాగ దనులకి
చంద్లాపూర్ గ్రామ ప్రజలు దక్కిన గౌరవం..
సంతోషం వ్యక్తం చేస్తూ…శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్ రావు గారు..
సిద్దిపేటకు గోదావరి జలాలు కావాలి అని ఒక కల.. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఆ కల నెరవేరింది.. కల నెరవేరడమే కాదు ఆ కలకు ప్రతిఫలం రావడం ఒక చరిత్ర అని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.. చంద్లాపూర్ గ్రామంలో నేడు రంగనాయక సాగర్ తో టూరిజం విలేజ్ గా జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం సిద్దిపేట ప్రజలకు రంగనాయక సాగర్ లో భూమి త్యాగం చేసిన త్యాగదనులకి దక్కిన గౌరవమని సిద్దిపేట ప్రజలకు అభినందనలు తెలుపుతు నేడు ఢిల్లీలో గ్రామ ప్రజల పక్షాన అవార్డు అందుకున్న గ్రామ సర్పంచ్ గారికి శుభాకాంక్షలు…
మంత్రి హరీష్ రావు పట్టుదలకు.. భూ నిర్వాసితుల ప్రతి ఫలం..
జడ్పి చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ.
మంత్రి హరీష్ రావు రంగనాయక సాగర్ నిర్మాణం లో.. ఈ ప్రాంతంలో గోదావరి జలాలు రావడంలో అహోరాత్రులు శ్రమించారని వారి కృషికి పట్టుదలకు, అదేవిధంగా ఈ రిజర్వాయర్ నిర్మాణంలో భూములిచ్చిన భూ నిర్వాసితుల త్యాగం గొప్పది అని ఇది అందుకు గొప్ప సార్థకత అని జడ్పి చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ అన్నారు.. ఈ సందర్భంగా గ్రామ ప్రజల పక్షనా ధన్యవాదాలు తెలిపారు…
మంత్రి హరీష్ రావు ప్రోత్సాహం వారు గ్రామ అభివృద్ధి కి, రిజర్వాయర్ ఏర్పాటు కు కృషి ఫలితమని మా గ్రామం తరుపున నేడు జాతీయ స్థాయిలో అవార్డు అందుకోవడం అదృష్టం గా భావిస్తున్నా అని గ్రామ సర్పంచ్ చంద్రకళ రవి లు అన్నారు మంత్రి హరీష్ రావు గారికి కృతజ్ఞతలు తెలిపారు..