చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

నవతెలంగాణ – హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు పుట్టిన రోజు.. ఆయనకు దేశవ్యాప్తంగా ఉన్న సినీ రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. చిరంజీవిని విష్ చేశారు. నిండు నూరేళ్లూ ఆరోగ్యంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు.‘స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి.. సినీ అభిమానుల హృదయాల్లో చిరంజీవిగా చిరస్థానాన్ని పదిలపరుచుకున్న మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సినీ పరిశ్రమ భవిష్యత్తును, సినీ కార్మికుల సంక్షేమాన్ని సదా కోరుకునే మీరు.. నిండు నూరేళ్లూ ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను” అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

Spread the love