చంద్రబాబుకు జైలులో స్వల్ప అస్వస్థత

నవతెలంగాణ- అమరావతి: రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు నాయుడు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఎండతీవ్రతతో జైల్లో డీహైడ్రేషన్ కు గురయ్యారు. నాలుగు రోజులుగా ఎండతీవ్రత పెరగడంతో డీహైడ్రేషన్ బారినపడ్డారు. ఉక్కపోత విషయాన్ని జైలు వైద్యాధికారుల తెలియజేశారు.. చంద్రబాబు ఉంటున్న బ్లాక్‌లో ఫ్యాన్‌ కూడా లేకపోవడంతో ఆయన ఉక్కపోతకు గురయ్యారు.. ములాఖత్ లో కుటుంబసభ్యులకు తెలియజేశారు చంద్రబాబు. .

Spread the love