చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల

 చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల
చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల

నవతెలంగాణ రాజమండ్రి: రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబు ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేసినట్లు జైలు సూపరింటెండెంట్ రాహుల్ తెలిపారు. ఎనిమిది అంశాలపై చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని జైలు అధికారులు వెల్లడించారు. బీపీ 130/70, టెంపరేచర్…నార్మల్, పల్స్…..68 /min, రెస్పీరేటరీ రేటు…..12/min, Spo2…..98% on room air, Heart..s1+,s2+, లంగ్స్…..క్లియర్, పిజికల్ యాక్టివిటీ బాగుందని చంద్రబాబు వైద్య నివేదికలో జైలు అధికారులు పేర్కొన్నారు.

Spread the love