నవతెలంగాణ – అమరావతి: సీఎం చంద్రబాబు హైదరాబాద్ పర్యటన రద్దు అయింది. వరదల నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్‌లో జరుగుతున్న బాలకృష్ణ సినీరంగ స్వర్ణోత్సవ వేడుకలకు హాజరు కావడం లేదని ట్వీట్ చేశారు. ‘బాలకృష్ణకు శుభాకాంక్షలు. బాలయ్య మరెన్నో ఘన విజయాలు సాధించాలని, తెలుగు చలన చిత్ర సీమలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా మరిన్ని పాత్రలు పోషించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను’ అని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.