పవన్‌తో చంద్రబాబు భేటీ…

Chandrababu-Pawanనవతెలంగాణ – అమరావతి: ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజారిటీ రావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు పవన్‌ సాదర స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు. అనంతరం ప్రత్యేకంగా భేటీ అయిన నేతలు.. ప్రభుత్వ ఏర్పాటు, సీఎం ప్రమాణస్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చించినట్టు సమాచారం. ఎన్డీయే సమావేశానికి హాజరయ్యే అంశంపైనా ఇరువురు నేతలు సమాలోచనలు జరిపినట్టు తెలుస్తోంది.

Spread the love