చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం..

నవతెలంగాణ-హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రమాదం తృటిలో తప్పింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కాతేరులో టీడీపీ ‘రా కదలిరా’ నిర్వహించారు. ఈ సభకు టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అయితే స్టేజ్‌పై ఉన్న చంద్రబాబుకు దండ వేసేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఒకరినొకరు తోసుకుంటూ చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించారు. దీంతో స్టైజ్‌పై ఉన్న చంద్రబాబు కిందపడబోయారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది చంద్రబాబును కిందపడకుండా పట్టుకున్నారు. దీంతో చంద్రబాబుకు ప్రమాదం తృటిలో తప్పింది. అయితే ఈ ఘటనపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. నేతలు, కార్యకర్తలు తొందరపాటు పనికి రాదని.. నిదానమే ప్రధానం అని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది.

Spread the love