నవతెలంగాణ-హైదరాబాద్ : ఈ రోజు కోసం చంద్రబాబు అభిమానులు, టీడీపీ నేతలు దేశ వ్యాప్తంగా ఒక నాయకుడిగా చంద్రబాబు ను ఇష్టపడేవారు ఎంతగానో వెయిట్ చేశారు. చంద్రబాబుపై క్వాష్ పిటీషన్ పాన తీర్పును ఈ రోజు హై కోర్ట్ వెలువడిస్తుందని ఆశించిన వీరికి చుక్క ఎదురైంది. ఈ రోజు ఉదయం నుండి చంద్రబాబు సిఐడి తరపున లాయర్లు తమ వాదనలను కోర్ట్ కు వినిపించారు. కోర్ట్ లో వీరిద్దరి మధ్యన వాదనలు హాట్ హాట్ గా సాగినట్లు తెలుస్తోంది. కాగా హై కోర్ట్ ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత తీర్పును మాత్రం ప్రకటించకుండా రిజర్వు చేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. కాగా ఈ తీర్పును మరో రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంతకీ ఈ తీర్పు చంద్రబాబుకు వ్యతిరేకంగా వస్తుందా లేదా అనుకూలంగా వస్తుందా అన్నది అందరిలోనూ సందేహం నెలకొంది. కానీ కోర్ట్ లో వాదనలు చేస్తున్న సమయంలో లాయర్ లకు ఒక అంచనా వచ్చి ఉండే అవకాశం ఉంది. మనము సరిగ్గా వాదించామా లేదా ? సరైన పాయింట్ లతో ప్రత్యర్థిని ఇరుకున పెట్టామా అన్నది అసేసెమెంట్ చేసుకుని ఉంటారు.