చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం పంపిన చంద్రబాబు..

నవతెలంగాణ – అమరావతి: తన ప్రమాణస్వీకారానికి రావాలని మెగాస్టార్ చిరంజీవికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆహ్వానం పంపించారు. రాష్ట్రం నుంచి ప్రత్యేక అతిథిగా హాజరు కావాలని కోరారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులతో పాటు పలువురు సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు అందజేశారు. కాగా, బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. కేసరపల్లి ఐటీ పార్కు ప్రాంగణంలో ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Spread the love