సీఎంగా జూన్ 9న చంద్రబాబు ప్రమాణం..

నవతెలంగాణ – అమరావతి:  అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో టీడీపీ అభ్యర్థులు గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీని పార్టీ నేతలు ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జూన్ 9న రాజధాని అమరావతి కేంద్రంగా సీఎంగా ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. ఉమ్మడి ఏపీ, విభజిత రాష్ట్రం కలిపి ఇప్పటివరకు 3 సార్లు సీఎంగా బాధ్యతలు నిర్వహించిన ఆయన 4వ సారి బాధ్యతలు చేపట్టనున్నారు.

Spread the love