చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామికం

– చంద్రబాబుకు మద్దతుగా పీర్జాదిగూడలో ర్యాలి
– పోలీసుల అరెస్టు- సీపీఎం మద్దతు
నవతెలంగాణ-బోడుప్పల్: ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసన మేడ్చల్ జిల్లా పీర్జాదీగూడ లో టీడీపీ మద్దతుదారులు ర్యాలి నిర్వహించారు. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు ర్యాలీ నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని స్టేషను కు తరలించారు. ఈ సందర్భంగా నిరసన కారులు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఆంద్రప్రదేశ్ కు పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చిన చంద్రబాబు నాయుడు పై అక్రమ కేసులు బనాయించి కుట్రపూరితంగా తప్పుడు కేసులలో ఇరికించారని ఇది ముమ్మటికి జగన్ సర్కారు చేపట్టిన పరికిపంద చర్యగా అభివర్ణించారు.అరెస్టైన వారిలో టీడీపీ నేతలు వి.సన్ని,కూతాడి నరసింహ, కేనర నగర్ వాసులు యూ.ఉషా,చైతన్య, రవి,సురేష్, హన్మంతరావు, శ్రీనివాస్, నర్సమ్మ తదితరులు ఉన్నారు.
సీపీఎం సంఘీభావం…
ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా పీర్జాదీగూడ లో టీడీపీ శ్రేణులు శాంతి యుతంగా ని ర్యాలీ నిర్వహిస్తుంటే మేడిపల్లి పోలీసులు అరెస్టు చేయడం సరికాదని సీపీఎం మేడిపల్లి మండల కార్యదర్శి ఎన్.సృజన అన్నారు.అరెస్టైన నిరసనకారులను మేడిపల్లి పీఎస్ పో పరామార్శించి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love