17కు చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ వాయిదా

నవతెలంగాణ – అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈనెల 17కు విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. స్కిల్‌ డవలప్‌మెంట్‌ స్కాం కేసులో బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు నాయుడు హైకోర్టును ఆశ్రయించారు. స్కిల్‌ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టేయడంతో దాన్ని హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో గురువారం వాదనలు జరిగాయి. చంద్రబాబు నాయుడు తరఫున సీనియర్‌ న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్‌, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించగా ఏపీ సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్‌ సుబ్రహ్మణ్యం వాదనలు వినించారు. ఈ స్కిల్‌ స్కాం కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. బెయిల్‌ ఇవ్వాలని కోరారు. కేసు విచారణకు తాను సహకరిస్తానని…నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. ఇరువాదనలు విన్న ధర్మాసనం ఈ కేసులో కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 17కి హైకోర్టు వాయిదా వేసింది.

Spread the love