– అక్టోబరు 5వరకు జైల్లోనే .. ఏసీబీ కోర్టు
విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు రెండ్రోజుల సీఐడీ కస్టడీ, రిమాండ్ ముగియడంతో ఆది వారం…విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆన్‌లైన్ ద్వారా విచారణ చేపట్టారు. చంద్రబాబు రిమాండ్ పొడిగించాలని సీఐడీ అధికారులు కోరగా.. అక్టోబరు 5వరకు పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు రెండ్రోజుల సీఐడీ కస్టడీ ముగిసిన తరువాత రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచే వర్చువల్‌గా న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చారు.”విచారణ సందర్భంగా సీఐడీ అధికారులు ఏమైనా ఇబ్బంది పెట్టారా? థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? ఏమైనా అసౌకర్యం కలిగిందా? వైద్య పరీక్షలు చేయించారా? అని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి.. చంద్రబాబును ప్రశ్నించారు. విచారణలో అధికారులు ఇబ్బంది పెట్టలేదని చంద్రబాబు జడ్జితో అన్నారు. విచారణ అనంతరం చంద్రబాబు రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.