నవతెలంగాణ – హైదరాబాద్: తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు తిరుపతిలో పర్యటించనున్నారు. రుయా, స్విమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించనున్నారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ఆయన పరిహారం ప్రకటిస్తారు.
షెడ్యూల్ ఇలా ఉంది…
ఈరోజు ఉదయం 11 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరుతారు.
గం.11.10 నిమిషాలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు.
గం.11.15 నిమిషాలకు విజయవాడ విమానాశ్రయం నుంచి విమానంలో తిరుపతికి బయలుదేరుతారు.
గం.1.2.00కు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు.
గం.12 నుంచి గం.3 వరకు రుయా, స్విమ్స్ ఆసుపత్రుల్లో క్షతగాత్రులను పరామర్శిస్తారు. ఈవో, టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
ఆ తర్వాత తిరుపతి విమానాశ్రయానికి బయలుదేరుతారు.
మధ్యాహ్నం గం.3.00కు తిరుపతి విమానాశ్రయం నుంచి విజయవాడకు బయలుదేరుతారు.
గం.3.45 నిమిషాలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు.
గం.3.50కి విజయవాడ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో ఉండవల్లిలోని తన నివాసానికి బయలుదేరుతారు.
సాయంత్రం గం.4.00కు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.