భూకక్ష్యలోకి చంద్రయాన్ – 3

నవతెలంగాణ న్యూఢిల్లీ: చంద్రుడి(Moon) దక్షిణ ధ్రువంపై పరిశోధనలే ధ్యేయంగా భారత్ ప్రవేశపెట్టిన చంద్రయాన్ – 3(Chandrayaan-3) విషయంలో ఇస్రో మరో రికార్డు నమోదు చేసింది. చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ప్రొపల్షన్ మాడ్యూల్(Propulsion Module)ని విజయవంతంగా మళ్లీ భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అయితే ఈ ప్రయోగాన్ని మొదట అనుకోలేదని ఇస్రో సైంటిస్టులు తెలిపారు. చంద్రుడి ఉపరితలంపై ప్రయోగాలకోసం పంపిన ఈ మూన్ మిషన్ తాజా రికార్డు మరింత లోతుగా ప్రయోగాలు చేయడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. జాబిల్లిపై నమూనాలు సేకరించి అక్కడ నుంచి తిరిగి వచ్చే మిషన్ కోసం ప్రణాళికలు రూపొందించేందుకు ప్రొపల్షన్ మాడ్యూల్లోని అదనపు సమాచారం ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

Spread the love