మార్కెట్ కమిటీ చైర్మన్ చందుర్తి కి లేనట్టేనా ?

Market Committee Chairman Chandurthi?– రుద్రంగి మార్కెట్ చైర్మన్ కు నాయకుల పోటీ
– చందుర్తి, రుద్రంగి నాయకుల కుర్చీల కుస్తీ
– గత ప్రభుత్వంలో రుద్రంగికి మొండి చేయి
– ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వద్ద క్యూ..!
నవతెలంగాణ – చందుర్తి
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయా మండలాల వ్యవసాయ మార్కెట్ లకు చైర్మన్ ల ను ఎంపిక చేయడంతో  రుద్రంగి వ్యవసాయం మార్కెట్ చైర్మన్ కుర్చీ కోసం  ఉమ్మడి మండలంలోని నాయకులు ఉవ్విళ్లూ ఊరుతున్నారు. దీంతో ఆ పదవి కోసం నాయకులు పోటీ పడుతున్నారు.వ్యవసాయ మార్కెట్ 2016 వరకు వేములవాడ మార్కెట్ పరిధిలో ఉప మర్జెట్ గా ఉంది గత బిఆరెస్ ప్రభుత్వం వచ్చాక ప్రత్యేక మార్కెట్ ఏర్పాటు చేసి చైర్మన్ లను నియమించింది. దీంతో నామినేటెడ్ పోస్టులకు భారీగా పోటీలు ఏర్పడ్డాయి.
చందుర్తి నుండి ముగ్గురు చైర్మన్ లు
గత బిఆరెస్ ప్రభుత్వం లో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను మూడు సార్లు గా చందుర్తి మండల నాయకులకే కట్టబెట్టింది. లింగం పేట కు చెందిన దప్పుల అశోక్ 2016 నుండి 2018 వరకు చైర్మన్ చేశాడు,చందుర్తి కి చెందిన పొన్నాల శ్రీనివాసరావు  2020 నుండి2023 వరకు , 2023 లో కట్ట లింగం పేటకు చెందిన ఏనుగుల శ్రీనివాస్ ముగ్గురు చందుర్తి మండల కి చెందిన వారే కావడం తో   రుద్రంగి మండల  నాయకులకు మొండిచేయి మిగిలింది .దీంతో అక్కడి నాయకులు నిరాశతో ఉన్నారనే వాదన అప్పట్లో బహిరంగంగ నే చర్చ జరిగింది.
కాంగ్రెస్ ప్రభుత్వంలో రుద్రంగికి అవకాశం వచ్చేనా
గత ప్రభుత్వం లో  రుద్రంగి నాయకులకు మార్కెట్ ఛైర్మన్   ఆవకాశం ఇవ్వకుండ చందుర్తి నాయకులకు మూడు సార్లు అవకాశం ఇవ్వడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి  ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సొంత మండలం కావడంతో ఈ సారి తమ మండలానికి దక్కించుకోవాలని స్థానిక నాయకులు ఎమ్మెల్యే ఆది వద్ద క్యూ కడుతున్నట్లుగా తెలుస్తుంది.దీంతో ఈ సారి రుద్రంగి మార్కేట్ చైర్మన్ స్థానిక నాయకులకే ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.
రెండు మండలాల నాయకుల కుస్తీ
చందుర్తి, రుద్రంగి మండలాల నాయకులు చైర్మన్ కుర్చీ కోసం  ఎవరికి వారే ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.  రుద్రంగి నుండిచెలుకల తిరుపతి,చందుర్తి మండలం నుండి బొజ్జ మల్లేశం,కనక రాజు,ఈగోళం శ్రీనివాస్, బండారు శేఖర్ మానాల గ్రామానికి చెందిన కొందరు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వద్ద దస్తి వేసుకొని కూర్చున్నారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది.
డైరెక్టర్ ఎంపిక మీదే: ఎమ్మెల్యే ఆది
చైర్మన్ పోస్ట్ వ్యవహారం నేను చూసుకుంటాను. డైరెక్టర్ ల ఎంపిక మాజీ జెడ్పిటిసి  నాగం కుమార్,పార్టీ అధ్యక్షుడు చింత పంటి రామస్వామికి అప్పగించినట్లుగా సమాచారం.దీంతో అటు చైర్మన్ ఇటు డైరెక్టర్ ల ఎంపిక విషయంలో ఎమ్మెల్యే ఆది.శ్రీనివాస్ వద్ద ముడిపడిందని తెలుస్తుంది.దీంతో చైర్మన్ గిరి ఈ సారి రుద్రంగి నాయకుల కె  ఇచ్చేఅవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
Spread the love