ఐపీఎల్‌ షెడ్యూల్‌లో మార్పులు

ఐపీఎల్‌ షెడ్యూల్‌లో మార్పులు– రెండు మ్యాచులను రీ షెడ్యూల్‌ చేసిన బీసీసీఐ
ముంబయి : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2024 సీజన్‌ విజయవంతంగా కొనసాగుతుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్‌ 17 షెడ్యూల్‌ను నిర్వాహకులు రెండు విడతలుగా విడుదల చేశారు. ఏప్రిల్‌ 17న శ్రీరామనవమి సందర్భంగా కోల్‌కతలో పండుగ సంబురాలు తారాస్థాయిలో ఉండనున్నాయి. అదే రోజు కోల్‌కత నైట్‌రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ ఈడెన్‌గార్డెన్స్‌లో తలపడాల్సి ఉంది. ఐపీఎల్‌ మ్యాచ్‌కు, పండుగ వేడుకలకు భద్రత కల్పించటంపై కోల్‌కత పోలీసులు అసక్తతను వ్యక్తం చేశారు. దీంతో ఐపీఎల్‌ నిర్వాహకులు షెడ్యూల్‌లో మార్పులు చేశారు. ఏప్రిల్‌ 17న ఈడెన్‌గార్డెన్స్‌లో జరగాల్సిన నైట్‌రైడర్స్‌, రాయల్స్‌ మ్యాచ్‌ను ఓ రోజు ముందుకు జరిపారు. దీంతో కోల్‌కత నైట్‌రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ ఏప్రిల్‌ 16న ఈడెన్‌ గార్డెన్స్‌లో పోటీపడనున్నాయి. ఏప్రిల్‌ 16న అహ్మదాబాద్‌ వేదికగా జరగా ల్సిన గుజరాత్‌ టైటాన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ను ఏప్రిల్‌ 17న నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐపీఎల్‌ నిర్వాహకులు మంగళవారం రీ షెడ్యూల్‌లో విడుదల చేశారు. నిరుడు 2023 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ సమయంలోనూ పండుగ సంబురా లకు భద్రత ఏర్పాట్ల దృష్ట్యా ప్రపంచ కప్‌ షెడ్యూల్‌లోనూ మార్పులు చేసిన సంగతి తెలిసిందే.నవరాత్రి ఉత్సవాల తొలి రోజునే ఈడెన్‌గార్డెన్స్‌లో భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరగాలి.కానీ భద్రతా కారణాలతో మెగా మ్యాచ్‌ను అహ్మదాబాద్‌కు తరలించిన సంగతి తెలిసిందే.

Spread the love