బ్రిజ్‌భూషణ్‌పై చార్జిషీట్‌

బ్రిజ్‌భూషణ్‌పై చార్జిషీట్‌న్యూఢిల్లీ : మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బిజెపి ఎంపిి, భారత రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ ఛీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై ఎట్టకేలకు ఛార్జిషీట్‌ నమోదైంది. అతడిపై ఢిల్లీ కోర్టు మంగళవారం అభియోగాలు నమోదు చేసింది. క్రీడాకారులపై లైంగిక వేధింపు లకు పాల్పడటం, ఆపై బెదిరించడం వంటి అభియోగాలు నమోదయ్యాయి. అతడితో పాటు ఈ కేసులో సహా నిందితుడిగా ఉన్న డబ్ల్యుఎఫ్‌ఐ మాజీ సహాయక కార్యదర్శి వినోద్‌ తోమర్‌పై కూడా బెదిరింపులకు పాల్పడిన నేరం కింద అభియోగాలను కోర్టు నమోదు చేసింది. కాగా అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ (ఎసిఎంఎం) ప్రియాంక రాజ్‌పూత్‌ ముందు విచారణకు హాజరైన బ్రిజ్‌భూషణ్‌ తన నేరాన్ని అంగీకరించలేదు. ‘నేను దోషి కానప్పుడు ఎందుకు నేరాన్ని అంగీకరిస్తాను’ అని వాదించాడు. బ్రిజ్‌భూషణ్‌ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలో రెజ్లర్లు ఆందోళన చేయడం దేశవ్యాప్తంగా సంచలనమైన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనూ బ్రిజ్‌ భూషణ్‌తో బిజెపి తన అనుబంధాన్ని కొనసాగించింది. ఆయన ప్రాతి నిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్‌ లోక్‌సభ స్థానం నుంచి అతడి కుమా రుడు కరణ్‌ భూషణ్‌ సింగ్‌ను బిజెపి బరిలోకి దింపింది.

Spread the love