చారి.. సాహసాల యాత్ర షురూ

Chari.. The journey of adventure begins‘చక చక మొదలిక… సాహసాల యాత్ర ఆగదిక… ఇది ఆపరేషన్‌ రుద్రనేత్ర’ అని ‘చారి 111’ టీమ్‌ అంటోంది. స్టైలిష్‌గా పిక్చరైజ్‌ చేసిన థీమ్‌ సాంగ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు యూట్యూబ్‌లో ఈ సాంగ్‌ వైరల్‌ అవుతోంది. ‘వెన్నెల’ కిశోర్‌ కథానాయకుడిగా నటించిన సినిమా ‘చారి 111’. టీజీ కీర్తి కుమార్‌ దర్శకత్వం వహించారు. సంయుక్తా విశ్వనాథన్‌ హీరోయిన్‌. బర్కత్‌ స్టూడియోస్‌ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు. మురళీ శర్మ ప్రధాన పాత్రధారి. మార్చి 1న థియేటర్లలో విడుదల కానుంది.
తాజాగా ‘చారి 111’ థీమ్‌ సాంగ్‌ విడుదల చేశారు. ఈ పాటను సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి రాయగా, ‘జవాన్‌’ ఫేమ్‌ సంజీత భట్టాచార్య ఆలపించారు. సైమన్‌ కె కింగ్‌ మంచి స్టైలిష్‌ ట్యూన్‌ అందించారు. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ, ‘మా సినిమాలో ఒక్కటే సాంగ్‌ ఉంది. స్టార్టింగ్‌ టైటిల్స్‌లో వస్తుంది. ఈ పాటను నేపథ్య సంగీతంలో ఉపయోగించాం. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్‌ ఫెంటాస్టిక్‌ రెస్పాన్స్‌ అందుకుంది. వెన్నెల కిశోర్‌ని ఇంతకు ముందెప్పుడూ ఇలా చూడలేదని ప్రేక్షకులు చెబుతున్నారు. ఆయన లుక్స్‌, స్టైలిష్‌ స్పైగా చేసిన కామెడీ సూపరని చెబుతున్నారు. సినిమా కూడా అందరికీ నచ్చుతుంది’ అని చెప్పారు. ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా ‘చారి 111’ థీమ్‌ సాంగ్‌ విడుదలైంది.

Spread the love