చే.. సెన్సార్‌ పూర్

Censor completeక్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా తెలుగులో రూపొం దుతున్న చిత్రం ‘చే’. లాంగ్‌ లైవ్‌ అనేది ట్యాగ్‌ లైన్‌. నవ ఉదయం సమర్పణలో నేచర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై బీఆర్‌ సభావత్‌ నాయక్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్‌ సభ్యులు యు/ ఎ సర్టిఫికెట్‌ జారీ చేశారు. క్యూబా తరువాత ప్రపం చంలోనే తొలిసారి భారతీయ చిత్ర పరిశ్రమలో రూపొందుతున్న చేగువేరా బయోపిక్‌ ఇది.సూర్య, బాబు, దేవేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్‌, కార్తీక్‌ నూనె, వినోద్‌, పసల ఉమా మహేశ్వర్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. రవిశంకర్‌ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు బి.ఆర్‌ సభావత్‌ నాయక్‌ మాట్లాడుతూ, ‘చేగువేరా బయోపిక్‌ తీయాలన్నది నా ఇరవై ఏళ్ల కల. విప్లవ వీరుడు చేగువేరా లైఫ్‌లో జరిగిన ఎన్నో అరుదైన విషయాలు ఈ సినిమాలో చూపిస్తున్నాం. అనాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు తెరకెక్కిం చాం. క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్‌ కాలేదు. ఇటీవలే చేగువేరా కూతురు డాక్టర్‌ అలైదా గువేరా రిలీజ్‌ చేసిన ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌కు, లేటేస్ట్‌గా రిలీజైన టీజర్‌, ట్రైలర్స్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మా చిత్రాన్ని డిసెంబర్‌ మొదటి వారంలో థియేటర్‌లలో రిలీజ్‌ చేయబోతున్నాం’ అని తెలిపారు.

Spread the love