నవ తెలంగాణ – మోర్తాడ్
టిఆర్ఎస్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకం ద్వారా లబ్ధిదారులకు ఇచ్చిన తప్పుడు పత్రాలతో మోసం చేసింది కాకుండా వాటిని అమలు చేయాలంటూ ధర్నాలు చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాములు అన్నారు. మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులకు ఐదు లక్షల రూపాయల ఇస్తామంటున్నప్పటికీ, వాటిని కాదంటూ టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన మూడు లక్షల రూపాయలు కావాలంటూ ధర్నా చేయడం సరికాదని, లబ్ధిదారులకు ఇచ్చిన పత్రాలను ఎలాంటి సంతకాలు లేకుండా అధికారులకు తెలియకుండానే నాయకులు పంపిణీ చేసిన ఘనత వారికి దక్కిందని అన్నారు. అధికారికంగా ఇవ్వాల్సిన మంత్రి తప్పుడు ప్రింటింగ్ పత్రాలు ఇచ్చి లబ్ధిదారులను మోసం చేశాడని, వాటిపై మంత్రి సంతకం గాని, అధికారుల సంతకాలు గాని ఎందుకు లేవని ప్రశ్నించారు. ఓట్ల కోసం తప్పుడు పత్రాలను ఇచ్చి ఓట్లు దండుకోవాలని చూసారే తప్ప, లబ్ధిదారులకు న్యాయం చేయటంలో మోసపోయారని అన్నారు. మూడు లక్షల రూపాయలను రద్దు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులందరికీ ఐదు లక్షల రూపాయలను ఇస్తుందని, ఐదు లక్షల కాకుండా మూడు లక్షల కావాలంటూ ధర్నాలు నిర్వహించడం టిఆర్ఎస్ ప్రభుత్వ నాయకులకే చెల్లిందని అన్నారు. నిరసన తెలుపడంలో లబ్ధిదారుల కంటే, టిఆర్ఎస్ నాయకులే అధికంగా ఉన్నారని, ఇది నాయకుల నిరసనని తప్ప లబ్ధిదారుల నిరసన కాదని అన్నారు. మూడు లక్షల రూపాయల ప్రొసీడింగ్ కాపీలతోపాటు, పలు ప్రోసిడింగులు కేవలం డూప్లికేట్ అని అన్నారు. వీటన్నిటిపై అధికార పార్టీ విచారణ చేపట్టి , బాధ్యులపై చర్య తీసుకుంటామని అన్నారు. బాల్కొండ నియోజకవర్గం లో అధికారికంలో ఉన్న ఎమ్మెల్యేని ఈ ప్రెసిడెంట్ కాపీలో మంజూరుకు కృషి చేయాలని, అవి అమలు అయ్యే బాధ్యత ఎమ్మెల్యేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాములు, సంతోష్ ,గోపి ,అశోక్ ,ప్రవీణ్ ,గంగాధర్ , రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.