కొలెస్ట్రాల్ రెండు రకాలు. ఒకటి మంచి కొలెస్ట్రాల్, మరొకటి చెడు కొలెస్ట్రాల్. చెడు కొలెస్ట్రాల్‌నిLDL అంటారు. ఇది రక్తనాళాలలో అడ్డుపడి రక్తాన్ని గుండెకి చేరకుండా చేస్తుంది. దీని వల్లే గుండె పోటు, స్ట్రోక్ వంటి సమస్యలొస్తాయి. కొలెస్ట్రాల్ తగ్గాలంటే బ్రేక్‌ఫాస్ట్‌లో మంచి ఐటెమ్ తీసుకోవాలి. ఎందుకంటే రాత్రంతా ఏం తినకుండా ఉంటాం. కడుపు ఖాళీగా ఉంటుంది. ఈ టైమ్‌లో మంచి ఫుడ్ తీసుకుంటే పోషకాలు త్వరగా బాడీ అబ్జార్వ్ చేసుకుంటుంది. అందుకోసం ఏయే ఫుడ్స్ తీసుకోవాలో తెలుసుకోండి.
– ఓట్స్ ఫైబర్‌కి మంచి మూలం. ఫైబర్ కొలెస్ట్రాల్‌ని కరిగించి బయటికి పంపుతుంది. ఇందుకోసం పీచుపదార్థాలు తీసుకుంటే గుండెకి మంచిది. ఓట్స్‌ని చాలా రకాలుగా తీసుకోవచ్చు. మసాలా ఓట్స్, పాలతో కలిపి తీసుకోవచ్చు.
– ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చసొనతో గుడ్లని తీసుకోండి. పాలకూర వంటి ఫైబర్ రిచ్ ఆకుకూరలు తినండి. ఫైబర్‌తో కూడిన ప్రోటీన్ తినడం వల్ల మీ కొలెస్ట్రాల్ కరుగుతుంది.
– బాదంని నానబెట్టి పరగడపున తినడం చాలా మంచిది. ప్రతిరోజూ బాదం తింటే చెడు కొలెస్ట్రాల్ 5 శాతం తగ్గుతుంది. వీటి పాలని తీసుకోవడం వల్ల రక్తంలోని మలినాలు కూడా తగ్గిపోతాయి.
– పనీర్‌ని తీసుకోవడం వల్ల కూడా కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. వీటిని కూరలా వండి తినవచ్చు. లేదా చపాతీ పిండిలో కలిపి పరాఠాల్లా కూడా చేసుకుని తీసుకోవచ్చు.న