చెక్కులు, పట్టా పాస్‌పుస్తకాలు పంపిణీ చేసిన గుత్తా

నవతెలంగాణ-అడవిదేవులపల్లి
అడవిదేవులపల్లి మండల కేంద్రంలోని పలు అభివద్ధి కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి పాల్గొన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల నందు ఐదు లక్షల రూపాయలు జడ్పీ నిధులతో పాఠశాల ఆర్చి మరియు ప్రహరీ గోడ నిర్మాణం పూర్తవగా మంగళవారం ప్రారంభించారు. అనంతరం రైతు వేదిక నందు మండల వ్యాప్తిగా మాడ( ట్రై కోర్‌) పథకం కింద 74 మంది గిరిజనులకు మంజూరైన 91 లక్ష 25 వేల రూపాయల విలువగల చెక్కులను , 70 మంది రైతులకు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న అసైన్డ్‌ భూమి కి సంబంధించిన ప్రభుత్వం ద్వారా జారీ చేయబడిన పట్టా పాస్‌ పుస్తకాలను పంపిణీ చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ట్రైకోర్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఇస్లావత్‌ రామచంద్రనాయక్‌, ఎంపీపీ ధనావత్‌ బాలాజీ నాయక్‌ ,జడ్పిటిసి కుర్ర సేవ నాయక్‌, మండల పార్టీ అధ్యక్షులు కూరాకుల చిన్న రామయ్య ,స్థానిక సర్పంచ్‌ కొత్త మర్రెడ్డి ,ఏఎంసీ డైరెక్టర్‌ బండి వెంకటేశ్వర్లు, బి ఆర్‌ ఎస్‌ ప్రధాన కార్యదర్శి కుర్ర శీను నాయక్‌ ,ఎంపీటీసీ కుర్ర కష్ణ కాంత్‌ ,పేర్ల లింగయ్య, మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు సూర్య నాయక్‌ ,కో ఆప్షన్‌ మెంబర్‌ బాబ్జాన్‌, మండల యువజన విభాగ అధ్యక్షులు అశోక్‌ నాయక్‌, సర్పంచులు బాలు నాయక్‌, పకీర, శీను, కొండలు, ఉప సర్పంచ్‌ కేశ బోయిన కొండలు, ఎమ్మార్వో, ఎంపీడీవో, ఆర్‌ఐ పాల్గొన్నారు.

Spread the love