ఎస్వీ యూనివర్సిటీలోకి చిరుత సంచారం

తిరుపతి : తిరుమల కాలిబాటలో చిన్నారిని బలిగొన్న చిరుతను అటవీశాఖ అధికారులు పట్టుకున్నా..అక్కడి పరిసరాల్లో చిరుత పులులు దడపుట్టిస్తున్నాయి. తాజాగా తిరుపతి ఎస్వీ యూనివర్సిటి కళాశాలలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘం నేతలు ఆందోళనలు చేపడుతున్నారు. ఆదివారం రాత్రి ఇంజినీరింగ్‌ కళాశాలలో చిరుత కనిపించింది. దీంతో కళాశాలకు చెందిన విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతలు ఇలా కళాశాల సమీపంలో, ఎన్సీసీ గేట్‌ వద్ద దర్శనమివ్వడం చూసి పరుగులు తీశారట కొందరూ విద్యార్థులు. ఎస్వీ ఇంజినీరింగ్‌ కళాశాలలో, చిరుత పులుల సంచారం చాలా ఎక్కువగా ఉండటంతో విద్యార్థులను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

Spread the love