తెలుగులో చేగువేరా బయోపిక్‌

తెలుగు తెరపై మరో బయోపిక్‌ రాబోతుంది. క్యూబా పోరాట యోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘చే’. లాంగ్‌ లైవ్‌ అనేది ట్యాగ్‌ లైన్‌. క్యూబా తరువాత ప్రపంచంలో తొలిసారి రూపొందుతున్న చేగువేరా బియోపిక్‌ ఇది. నవ ఉదయం సమర్పణలో నేచర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌ పై బి.ఆర్‌ సభావత్‌ నాయక్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య, బాబు, దేవేంద్ర నిర్మిస్తున్న ఈ చిత్రంలో లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్‌, కార్తీక్‌ నూనె, వినోద్‌, పసల ఉమామహేశ్వర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రోడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్ర పోస్టర్‌ను చేగువేరా తనయ డాక్టర్‌ అలైదా గువేరా ఆవిష్కరించి, చిత్రయూనిట్‌ను అభినందించారు. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు బి.ఆర్‌ సభావత్‌ నాయక్‌ మాట్లాడుతూ, ”విప్లవ వీరుడు, యువత స్ఫూర్తిదాయకుడు చేగువేరా జీవిత చరిత్రను సినిమాగా తీయడం చాలా గర్వంగా ఫీల్‌ అవుతున్నాను. ఆయన చేసిన పోరాటలు, త్యాగాలు ఈ చిత్రంలో తీశాం. అప్పటి పరిస్థితులకు అద్దం పట్టే విధంగా చాలా జాగ్రత్తలు తీసుకుని, ఎక్కడ కాంప్రమైజ్‌ కాకుండా రూపొందించాం’ అని చెప్పారు. ఈ చిత్రానికి డి.ఓ.పి : జగదీష్‌, ఎడిటర్‌ : శివ శర్వాణి, సంగీత దర్శకుడు : రవిశంకర్‌.

Spread the love