– పాపన్నపల్లిలో శివాజీ విగ్రహావిష్కరణ
నవతెలంగాణ – బెజ్జంకి
మొగలుల సామ్రాజ్యానికి వ్యతిరేకంగా దిగిన యుద్ధంలో శౌర్యపరాక్రమణలను ప్రదర్శించి శౌర్యానికి మారుపేరుగా మరాఠ సామ్రాజ్య చక్రవర్తి చత్రపతి శివాజీ ప్రతీకగా నిలిచాడని, అయనను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని శంబు సురేందర్ అన్నారు. మండల కేంద్రానికి అనుబంధ గ్రామమైన పాపన్నపల్లిలో స్థానికుడు శంబు సురేందర్ తనతండ్రి జ్ఞాపకార్థం నిర్మించిన నూతన చత్రపతి శివాజీ విగ్రహన్ని సోమవారం ఆరె క్షత్రియ సంఘం నాయకులు అవిష్కరించారు.అంతకుముందు మండల కేంద్రంలోని శివాజీ విగ్రహాం వద్ద అయన జయంతి వేడుకలను ఆరె క్షత్రియ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అయా పార్టీల నాయకులు, గ్రామస్తులు శివాజీ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.