నవతెలంగాణ – మద్నూర్
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు మద్నూర్ మండల కేంద్రంలో ఈనెల 22న గురువారం రోజు భారీ ఎత్తున నిర్వహించేందుకు సార్వజనిక శివా జన్మనోత్సవ సమితి మద్నూర్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 22న ఉదయం 10:00 నుండి అన్నదాన కార్యక్రమం ప్రారంభమవుతుందని, మధ్యాహ్నం రెండు గంటలకు ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటంతో శోభయాత్ర జరుపబడుతుందని, ఈ జయంతి ఉత్సవాలకు భారీ ఎత్తున జనాలు తరలిరావాలని పిలుపునిచ్చారు. జన్మదిన వేడుకలకు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ హాజరవుతున్నట్టు తెలుస్తోంది.