సింగంపల్లి గ్రామంలో ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు

నవతెలంగాణ – మోపాల్
మోపాల్ మండలంలోని సింగంపల్లి గ్రామంలో సోమవారం రోజున ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా అరికెల శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. చత్రపతి శివాజీ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కచ్చితంగా చత్రపతి శివాజీ జయంతి రోజున ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కోల గంగాధర్, గ్రామ యువకులు సురేష్, నవీన్, చరణ్, సంజీవ్ గంగారం తదితరులు పాల్గొన్నారు

Spread the love