నవతెలంగాణ – నవీపేట్
మండల కేంద్రంలోని శివాజీ చౌక్ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పిటిసి సవిత బుచ్చన్న హాజరై మాట్లాడుతూ పోరాట యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా తనను ఆహ్వానించి సత్కరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శివాజీ మహారాజ్ ను ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై యాదగిరి గౌడ్, ఎంపీటీసీ రాధా, కృష్ణ, రాజేందర్ గౌడ్, గణేష్, రాము, భూషణ్, బాలగంగాధర్, సుంకరి రాజు, భాను గౌడ్ తదితరులు పాల్గొన్నారు.