రైతాంగాన్ని కాపాడుకోవడమే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం : సీఎం కేసీఆర్

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ వ్యవసాయాన్ని, రైతాంగాన్ని కాపాడుకోవడమే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటసాగుకు అంతరాయం లేకుండా సాగునీటి సరఫరా కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని నీటిపారుదలశాఖ అధికారులను సూచించారు. ఇందుకు ఎంత ఖర్చయినా ఫర్వాలేదన్నారు. ‘పైసలు పోయినా ఫర్వాలేదు.. పంటలు కాపాడాలంటూ సీఎం ఆదేశించారు. రుతుపవనాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర రైతాంగానికి వానాకాలం పంట సాగునీటి సరఫరాకు ముందస్తు చర్యల కోసం మంత్రులు, ప్రజాప్రతినిధులు, నీటిపారుదలశాఖ అధికారులతో సీఎం అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అలాగే పాలమూరు-రంగారెడ్డి పనుల పురోగతిపై సైతం ఆరా తీశారు.

Spread the love