టీపీటీఎఫ్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి: చిక్కాల సతీష్

నవతెలంగాణ – పెద్దవంగర
టీపీటీఎఫ్ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం మండలాధ్యక్షుడు చిక్కాల సతీష్, జిల్లా కార్యదర్శి సోమారపు ఐలయ్య అన్నారు. సోమవారం మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యా వైజ్ఞానిక మహాసభలకు సంబంధించిన పోస్టర్ ఉపాధ్యాయునీలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఫిబ్రవరి 11, 12 తేదీలలో ఖమ్మంలో జరుగు ద్వితీయ విద్యా వైజ్ఞానిక మహాసభలకు ఉపాధ్యాయులు, మేధావులు,అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 317 జీవో వల్ల స్థానికత కోల్పోయిన టీచర్లకు ప్రభుత్వం న్యాయం చేయాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేజీబీవీ టీచర్లను రెగ్యులరైజ్ చేయాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. “అంతరాలు లేని విద్య ప్రజల హక్కు ప్రభుత్వ బాధ్యత”ప్రధాన అంశంగా ఈ విద్యా వైజ్ఞానిక మహాసభలు నిర్వహిస్తున్నామని , అసమాన సమాజంలో సమానత్వ విద్య, మహిళల స్థితిగతులు కర్తవ్యాలు, ప్రభుత్వ విధానాలు ఆర్థిక సంక్షోభం అను అంశాలపై ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ సి కాశీం ,బుర్ర రమేష్ ,ఏ నరసింహారెడ్డి, చందన చక్రవర్తి, ఎన్.వేణుగోపాల్ తదితరులు ప్రసంగించనున్నారని తెలిపారు. మహాసభలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర  ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు హాజరుకానున్నారు. కార్యక్రమంలో మండల నాయకులు యుగేందర్, సురేష్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, మురళి, వెంకటేశం, కేజీబీవీ పాఠశాల ఎస్ఓ స్రవంతి, ఉపాధ్యాయులు స్రవంతి, సైదమ్మ, కళ్యాణి, సరిత, శ్రీలత, సంధ్య రాణి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.
Spread the love